NEWSTELANGANA

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాలి

Share it with your family & friends

పిలుపునిచ్చిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – త్వ‌రలో రాష్ట్రంలో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌లలో కాంగ్రెస్ పార్టీ స‌త్తా చాటాల‌ని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం 17 సీట్ల‌లో హ‌స్తం హ‌వా కొన‌సాగేందుకు పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌య‌త్నం చేయాల‌ని కోరారు.

క‌ష్ట‌ప‌డే వారికి పార్టీ త‌ప్ప‌క అవ‌కాశం ఇస్తుంద‌ని అన్నారు. బీఆర్ఎస్ ప‌నై పోయింద‌ని, బీజేపనే మ‌న‌కు గ‌ట్టి పోటీ ఉంటుంద‌ని చెప్పారు. ఏ ఒక్క ఓటు ఇత‌ర పార్టీల‌కు వెళ్ల‌కుండా చూడాల్సిన బాధ్య‌త మీ అంద‌రిపై ఉంద‌న్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.

త‌మ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంద‌ని చెప్పారు. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆరు గ్యారెంటీలు ప్ర‌క‌టించామ‌ని ఇప్ప‌టికే నాలుగు అమ‌లులోకి వ‌చ్చాయ‌ని అన్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు రేవంత్ రెడ్డి.

ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌ను పార్టీ శ్రేణులు తిప్పి కొట్టాల‌ని పిలుపునిచ్చారు సీఎం. కాంగ్రెస్ పార్టీని అడ్డుకునే శ‌క్తి ఎవ‌రికీ , ఏ పార్టీకి లేద‌న్నారు .