పిలుపునిచ్చినీ రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని, భువనగరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. బుధవారం ఆయన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో ఏర్పాటైన ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు.
ఈ కీలక సమావేశానికి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు , ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తోందని చెప్పారు. ఈ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నాయని అన్నారు సీఎం.
ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి.