NEWSTELANGANA

కంద‌నూలులో కాంగ్రెస్ దే గెలుపు

Share it with your family & friends

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా – పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అత్య‌ధిక సీట్లు గెల‌వ బోతోంద‌ని జోష్యం చెప్పారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ప్ర‌చారంలో భాగంగా నాగ‌ర్ క‌ర్నూల్ లోక్ స‌భ ఎంపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వికి మ‌ద్ద‌తుగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించారు.

కీల‌క వ్యాఖ్య‌లు చేశారు సీఎం. కంద‌నూలులో కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌డం త‌ప్ప‌ద‌న్నారు. ప్ర‌జ‌లంతా మూకుమ్మ‌డిగా త‌మ‌కు ఓటు వేసేందుకు సిద్దంగా ఉన్నార‌ని చెప్పారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేస్తున్నామ‌న్నారు.

ఆగ‌స్టు 15 లోపు తాము ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన రూ. 2 ల‌క్ష‌ల రుణాల‌ను మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌తి ఒక్క‌రికీ అందుతుంద‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉంద‌ని, దీని కార‌ణంగా కొంచెం ఆల‌స్య‌మైంద‌న్నారు రేవంత్ రెడ్డి.

బీఆర్ఎస్ , బీజేపీ రెండూ ఒక్క‌టేన‌ని అన్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా తాము ప్ర‌వేశ పెట్టిన ఫ్రీ బ‌స్సు సౌక‌ర్యానికి అద్బుత‌మైన రీతిలో ఆద‌ర‌ణ వ‌స్తోంద‌న్నారు సీఎం.