పాలమూరు ఎమ్మెల్సీ మాదే – సీఎం
బీఆర్ఎస్ పార్టీ పని అయి పోయింది
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా తమ పార్టీ తరపున బరిలో నిలిచిన ప్రముఖ పారిశ్రామికవేత్త తనయుడు మన్నె జీవన్ రెడ్డి గెలుపొందడం ఖాయమని అన్నారు సీఎం. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
తమ పార్టీ అభ్యర్థి గ్రాండ్ విక్టరీ నమోదు చేస్తాడని, కనీసం 200 ఓట్లకు పైగా మెజారిటీ వస్తుందన్నారు. ఇక రాష్ట్రంలో నిన్నటి దాకా అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అహంకార పూరిత ధోరణితో పాలన సాగించి , అడ్డగోలు వ్యవహారాలకు తెర తీసిన మాజీ సీఎం కేసీఆర్ కు, ఆయన స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ పనై పోయిందని ఎద్దేవా చేశారు.
కల్వకుంట్ల కుటుంబం చర్లపల్లి లేదా చంచల్ గూడ జైలుకు వెళ్లాల్సిందేనని, చిప్ప కూడు తినాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. నాపై కుట్ర జరుగుతోంది. దీనికి తెర వెనుక నుండి కేసీఆర్, మోదీ ప్రయత్నం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.