ట్యాక్స్ పేయర్స్ కు రైతు భరోసా ఎందుకు
ప్రకటించిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు వస్తుందని ఆశించిన వారికి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పన్నులు కట్టే వారికి రైతు భరోసా ఎందుకు ఇవ్వాలంటూ ప్రశ్నించారు. వీరికి ఇచ్చే డబ్బులను అసలు, సిసలైన లబ్దిదారులు, కౌలుదారులకు ఇస్తే బావుంటుందని అన్నారు.
డబ్బులు కలిగిన వారికి భరోసా ఇవ్వడం వల్ల ఉపయోగం ఏం ఉంటుందంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో 14 సీట్లు కాంగ్రెస్ పార్టీకి పక్కా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి శాసన సభలో చర్చిస్తామని తెలిపారు సీఎం. అన్ని ప్రైవేట్ యూనివర్శిటీలపై విచారణ జరుపుతామని ప్రకటించారు.
ప్రణీత్ రావు వ్యవహారం ఇంకా ముగిసి పోలేదని, త్వరలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు రేవంత్ రెడ్డి. జీవో 3 పై కోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే మరింత గౌరవం పెరుగుతుందన్నారు.
కేసీఆర్ వందేళ్ల పాటు తెలంగాణను విధ్వంసానికి గురయ్యేలా చేశారని , దానిని కేవలం పది రోజుల్లో పట్టాలు ఎక్కించే ప్రయత్నం చేశామని అన్నారు రేవంత్ రెడ్డి. నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకుంటే మంచిదని సూచించారు.