NEWSTELANGANA

పెండింగ్ ప్రాజెక్టులపై ఫోక‌స్ పెట్టండి

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి స‌మీక్ష చేప‌ట్టారు. త్వ‌రిత‌గ‌తిన పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం చేప‌ట్టేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

ప్ర‌ధానంగా ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాపై ఫోక‌స్ పెట్టాల‌న్నారు. కోడంగ‌ల్ ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప‌నుల పురోగతి గురించి ఆరా తీశారు సీఎం. ప్ర‌త్యేకించి జిల్లా సాగు నీటి ప్రాజెక్టుల పైన ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు ఎనుముల రేవంత్ రెడ్డి.

కొడంగల్ లో చేప‌ల‌ మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాశించారు సీఎం. అంతే కాకుండా మద్దూరు రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణంపై పలు సూచనలు చేశారు. సాధ్య‌మైనంత అభివృద్ది ప‌నుల వేగం పుంజుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. నిధుల‌కు ఎలాంటి ఢోకా లేద‌న్నారు.

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అయితే కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు ఉమ్మ‌డి జిల్లాకు ఎంతో ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌న్నారు. దీని వ‌ల్ల తాగు, సాగు నీటికి ఇబ్బంది అంటూ ఉండ‌ద‌న్నారు.