Sunday, April 20, 2025
HomeNEWSప‌ర్యాట‌క రంగం అభివృద్దికి సోపానం

ప‌ర్యాట‌క రంగం అభివృద్దికి సోపానం

స్ప‌ష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – ప‌ర్యాట‌క రంగం తెలంగాణ‌కు ప్రాణ‌ప్ర‌దంగా మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. నూత‌న ప‌ర్యాట‌క విధానంపై కీల‌క వ్యాఖ్య‌ల చేశారు . గత 10 ఏళ్లుగా తెలంగాణకు ప్రత్యేక పర్యాటక విధానం రూపొందించ లేద‌ని ఆరోపించారు. దుబాయ్, సింగపూర్, చైనా దేశాల పర్యాటక విధానాలను అధ్యయనం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు రేవంత్ రెడ్డి. దుబాయ్‌, సింగపూర్‌ తరహాలో హైదరాబాద్‌లో షాపింగ్‌ మాల్స్‌ ఏర్పాటు చేయాలన్నారు.

హైదరాబాద్‌లో 365 రోజులు వాతావరణం బాగానే ఉందని, అందుకు అనుగుణంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచాలన్నారు. తమిళనాడులో లాగా హైదరాబాద్‌లో కూడా ఆటోమొబైల్ పరిశ్రమను ప్రోత్సహించాలని స్ప‌ష్టం చేశారు.

టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలను దేవాలయాలకు అనుసంధానం చేయాల‌ని సూచించారు సీఎం. తెలంగాణలో పులులను మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి తరలించే వాతావరణాన్ని కల్పించాలన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన తర్వాత టెంపుల్ టూరిజం పెరిగిందన్నారు. రొటీన్ టూరిజం కాకుండా కాన్సెప్ట్ పై దృష్టి పెట్టాలన్నారు. ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీలో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుపై అధ్యయనం చేయాల‌ని, 20 నిమిషాల ప్రయాణంలో కన్వెన్షన్ సెంటర్ విమానాశ్రయానికి చేరుకోవాలన్నారు.

పర్యాటక స్థలాలు, లీజులపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. లీజు గడువు ముగిసినా ఖాళీ చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీరియస్‌గా తీసుకోని కోర్టు కేసులపై స్టేలు రద్దు చేయండి. అడ్వకేట్ జనరల్‌తో చర్చించి మంచి న్యాయవాదులను నియమించాల‌ని స్ప‌ష్టం చేశారు.

మంచి పేరున్న సంస్థలకు పర్యాటక స్థలాలను లీజుకు ఇవ్వాలన్నారు తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి మంచి అవకాశాలు. విమానాశ్రయం నుంచి తెలంగాణలోని ఏ ప్రాంతానికి అయినా మూడు గంటల్లో చేరుకోవచ్చు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments