ప్రభుత్వానికి విద్య..వైద్యం రెండు కళ్లు
ఆరోగ్య లక్ష్యంగా సర్కార్ అడుగులు
హైదరాబాద్ – తమ ప్రభుత్వానికి విద్య..వైద్యం రెండు కళ్లు లాంటివని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు.
ఆరోగ్య సంరక్షణ ప్రతి పౌరుడికీ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. మౌలికమైన ఆరోగ్య సదుపాయాలను పౌరులందరికీ అందించడం కోసం 213 కొత్త అంబులెన్స్ లను ప్రారంభించడం ర జరిగిందన్నారు.
ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సోమవారం ఆరోగ్య శాఖ నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో నూతనంగా ఎంపికైన 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ ల తో పాటు 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు నియామక పత్రాలను అందచేశారు.
ఇదే సమయంలో 33 ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌లు, 28 పారామెడికల్, 16 నర్సింగ్ కాలేజీలు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర, పొన్నం పాల్గొన్నారు.