మరాఠాలో ఇండియా కూటమిదే గెలుపు
తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి
మహారాష్ట్ర – మరాఠాలో ప్రస్తుతం జరగబోయే శాసన సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ, శివసేన , ఎన్సీపీ సంకీర్ణ సర్కార్ కు ప్రజలు షాక్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని జోష్యం చెప్పారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి.
శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రుజారాలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ దేశంలో తాము మాత్రమే ఉండాలని కోరుకుంటోందని ధ్వజమెత్తారు.
అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే , ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు రావాలని అనుకుంటే తప్పనిసరిగా ఇండియా కూటమిలోని పార్టీలకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు అనుముల రేవంత్ రెడ్డి.
ఈ సమావేశంలో చంద్రపూర్ లోక్సభ ఎన్నికల ఇన్చార్జి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి , స్థానిక ముఖ్య నాయకులు, స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.