NEWSTELANGANA

11న ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం

Share it with your family & friends

ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

హైద‌రాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి తీపి క‌బురు చెప్పారు. పాల‌నా ప‌రంగా దూకుడు పెంచారు. కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఇచ్చిన ఆరు హామీల‌ను అమ‌లు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే నాలుగు గ్యారెంటీలు అమ‌ల‌వుతున్నాయ‌ని పేర్కొన్నారు సీఎం.

తెలంగాణ‌లో ఈనెల 11న ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కాన్ని ప్రారంభించ‌డం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు. ఇల్లు లేని వాళ్ల‌కు ఇల్లు ఇవ్వాల‌నే ఉద్దేశంతో సీఎస్ ను వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. త‌క్ష‌ణ‌మే విధి విధానాలు త‌యారు చేయాల‌ని సూచించారు.

ఈ ప‌థ‌కం కింద ఇంటి స్థ‌లం ఉంటే నిర్మాణానికి రూ. 5 ల‌క్ష‌లు ఇస్తామ‌ని , ఇల్లు లేక పోతే ఇంటి స్థ‌లంతో పాటు రూ. 5 ల‌క్ష‌లు అంద‌జేస్తామ‌ని పేర్కొన్నారు. అంతే కాకుండా ఇంటి ప్లాట్ లో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఆర్థిక సాయం ఇస్తామ‌న్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్లాట్లు లేని నిరుపేద‌ల‌కు ఇళ్ల ప‌థ‌కం కింద భూమి, డ‌బ్బులు ఇస్తామ‌ని పేర్కొన్నారు.