NEWSTELANGANA

ఐటీఐలు అడ్వాన్స్ టెక్నాల‌జీ సెంట‌ర్లు

Share it with your family & friends

ప్ర‌క‌టించిన సీఎం ఎనుముల రేవంత్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మ‌ర‌కు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిగింది. ఉచిత క‌రెంట్ తో పాటు రూ. 500 గ్యాస్ అంద‌జేయాల‌ని నిర్ణ‌యించింది. అంతే కాకుండా త‌మ స‌ర్కార్ నైపుణ్యాభివృద్దికి ప్ర‌యారిటీ ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

అంతే కాకుండా రాష్ట్రంలో ఇప్ప‌టికే ఉన్న 65 ప్ర‌భుత్వ ఐటీఐ కాలేజీల‌ను అడ్వాన్స్ టెక్నాల‌జీ సెంట‌ర్లుగా అప్ గ్రేడ్ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు పేర్కొన్నారు. యువ‌త‌కు ఉన్న‌త ఉపాధి అవ‌కాశాలు అందించే ఎస్డీసీకి సంబంధించిన కోర్సుల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు సీఎం.

ఇదిలా ఉండ‌గా ఈనెల 8న శాసనసభ బడ్జెట్ సమావేశాలు జ‌రుగుతాయ‌ని పేర్కొన్నారు. అయితే స‌మావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత బీఏసీలో నిర్ణయం తీసుకుంటామ‌న్నారు.

తొలి రోజున ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగిస్తారని పేర్కొంది స‌ర్కార్. గవర్నర్ ప్రసంగానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మరో రెండు గ్యారంటీల హామీల అమలుపై కేబినేట్ చర్చించింది.

రాచరికపు పునాదుల నుంచి త్యాగానికి పోరాటాలకు ప్రతిరూపంగా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ జీవన విధానాన్ని, కళా రూపాలను పునరుజ్జీవింప జేయాలని కేబినేట్ తీర్మానం చేసింది.