ఐటీఐలు ఇక స్కిల్ సెంటర్స్
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – నైపుణ్యం ద్వారానే అభివృద్ది అన్నది సాధ్యం అవుతుందని అన్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. మంగళవారం హైదరాబాద్ లోని మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో ఐటీఐ స్కిల్ డెవలప్ మెంట్ అప్ గ్రేడేషన్ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రంలో 60కి పైగా ఐటీఐలు ఉన్నాయని , గతంలో వాటిని ప్రభుత్వం పట్టించు కోలేదని ఆరోపించారు. కానీ తాము వచ్చాక నైపుణ్య అభివృద్దిపై ఎక్కువగా ఫోకస్ పెట్టామని చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ నిర్వహణకు గాను రూ. కోటి మంజూరు చేయడం జరిగిందన్నారు.
ఇక నుంచి ఐటీఐలు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చు కోవడం జరుగుతుందని తెలిపారు సీఎం. యువతకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇవి యువతకు ఉపాధి కల్పించే కేంద్రాలుగా తీర్చి దిద్దుతామని స్పష్టం చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి.