NEWSTELANGANA

ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసే ప్ర‌స‌క్తి లేదు

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – నిరుద్యోగులు చేస్తున్న ఆందోళ‌న‌లు , పోరాటాలు పూర్తిగా అసంబ‌ద్ద‌మైన‌వ‌ని పేర్కొన్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. గ‌త ప‌దేళ్లుగా ప‌రీక్ష‌లు చేప‌ట్టాల‌ని, జాబ్స్ భ‌ర్తీ చేయాల‌ని డిమాండ్ చేసిన వాళ్లు ఎవ‌రో ఒక‌రిద్ద‌రి కోసం ధ‌ర్నాలు చేయ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆరు నూరైనా స‌రే తాను ఎవ‌రికీ త‌ల వంచే ప్ర‌స‌క్తి లేద‌న్నారు సీఎం.

ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విధంగానే ఆయా జాబ్స్ భ‌ర్తీకి సంబంధించి ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌ని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు ఎనుముల ర‌వేంత్ రెడ్డి. తెలంగాణ ఆకాంక్షకు ప్రధాన కారణమైన నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రజా ప్రభుత్వం కంకణబద్ధమై ఉన్నదని స్పష్టం చేశారు.

అసెంబ్లీ సమావేశాల్లో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టు చిక్కులు, ఇతర గందరగోళాలను పరిష్కరించి ఇప్పటిదాకా 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామన్నారు సీఎం.

▪️గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల భర్తీ, డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీ ప్రక్రియలోనూ నిబంధనల ప్రకారం, కోర్టు చిక్కులు తలెత్తకుండా, నిరుద్యోగులకు న్యాయం జరిగేలా స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు.

సివిల్ ఇంజనీర్ల కొరత చాలా ఉందని.. కానీ కొన్ని కాలేజీలు సివిల్ ఇంజనీరింగ్ విభాగాన్ని ఎత్తేసే పనిలో ఉన్నాయ‌ని వాపోయారు. ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్లను తప్పనిసరిగా తయారు చేయాల‌ని, లేకుంటే భ‌విష్య‌త్తులో ఇబ్బందులు త‌లెత్తే ప్ర‌మాదం ఉంద‌న్నారు ఎనుముల రేవంత్ రెడ్డి.