NEWSTELANGANA

పోచారంకు స‌ముచిత స్థానం

Share it with your family & friends

ప్ర‌క‌టించిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీక‌ర్ , బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు . ఆయ‌న బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. గ‌త కొంత కాలం నుంచీ ఆయ‌న పార్టీ ప‌ట్ల‌, బాస్ కేసీఆర్ ప‌ట్ల కొంత అస‌హ‌నంతో ఉన్నారు.

పార్టీలో సీనియ‌ర్ నాయ‌కుడిగా, కేసీఆర్ కు ఆత్మీయుడిగా, అత్యంత స‌న్నిహితుడిగా పేరొందారు. కానీ ఉన్న‌ట్టుండి త‌న మ‌న‌సు మార్చుకున్నారు. శుక్ర‌వారం సీఎం రేవంత్ రెడ్డి స్వ‌యంగా పోచారం ఇంటికి వెళ్లారు. ఆయ‌న‌ను కాంగ్రెస్ పార్టీలోకి రావాల‌ని ఆహ్వానించారు. ఆయ‌న‌తో పాటు కొడుకు కూడా పార్టీలోకి రావాల‌ని కోరారు.

తండ్రీ కొడుకులు స‌మ్మ‌తించ‌డంతో కండువాలు కప్పి ఆహ్వానించారు సీఎం. అనంత‌రం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పున‌ర్నిర్మాణంలో పోచారంను క‌లిశామ‌ని చెప్పారు. పెద్ద‌గా ఉండాల‌ని కోరార‌ని తెలిపారు సీఎం.

తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ లో చేరార‌ని స్ప‌ష్టం చేశారు. రైతుల సంక్షేమంపై వారి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళతామ‌ని అన్నారు. రైతు రుణ మాఫీ విధి విధానాలపై ఇవాళ మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. భవిష్యత్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత గౌరవం ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.