రాజీవ్ గాంధీ మహా నాయకుడు
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ గురించి ప్రశంసలు కురిపించారు. ఆయన వల్లనే ఇవాళ భారత దేశంలో టెలికాం రంగంలో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయని స్పష్టం చేశారు.
ఒక రకంగా చెప్పాలంటే విప్లవాత్మక మార్పు తెచ్చిన మహా నాయకుడు రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు. అందుకే తమ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకార్థం చేపట్టే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా ప్రసంగించారు. ఒక పక్క అంబేద్కర్, మరో పక్క ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డి విగ్రహాలు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉన్నాయని కానీ రాజీవ్ గాంధీ విగ్రహం లేదన్నారు.
దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు అని కొనియాడారు. ఆయన విగ్రహం కేవలం జయంతి, వర్దంతులకు దండలు వేసి దండాలు పెట్టడానికి కాదన్నారు. ఇది చరిత్రలో నిలిచి పోయే సందర్బమని పేర్కొన్నారు సీఎం.