NEWSTELANGANA

తెలంగాణాలో ఫార్మా కంపెనీల విస్త‌ర‌ణ

Share it with your family & friends

గ్రీన్ ఫార్మా ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందం

హైద‌రాబాద్ – తెలంగాణ‌పై ఫార్మా కంపెనీలు ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాయి. ఇప్ప‌టికే ప్రపంచంలోనే అత్య‌ధిక ఫార్మా కంపెనీలు ఉన్న దేశంగా ఇండియాకు పేరుంది. ఇందులో ఎక్కువ‌గా ఫార్మా కంపెనీలు హైద‌రాబాద్ లోనే కొలువు తీరి ఉన్నాయి. ఇప్ప‌టికే కాలుష్యం వెద‌జ‌ల్లుతుండ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ త‌రుణంలో ఫార్మా కంపెనీలు మ‌రింత విస్త‌రించే ప‌నిలో ప‌డ్డాయి. ఈ విష‌యాన్ని స్వ‌యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. రాష్ట్ర స‌చివాల‌యంలో కీల‌క‌మైన స‌మావేశం జ‌రిగింది ఫార్మా కంపెనీల ప్ర‌తినిధుల‌తో.

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన మీటింగ్ లో సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆరు ప్రముఖ ఫార్మా కంపెనీలు తమ కార్యకలాపాల విస్తరణతో పాటు కాలుష్య రహిత గ్రీన్ ఫార్మా ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నాయి.

ఈ ఒప్పందాల ఫలితంగా రూ.5,260 కోట్ల విలువైన పెట్టుబడులతో పాటు 12,490 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని స్ప‌ష్టం చేశారు సీఎం అనుముల రేవంత్ రెడ్డి.