Sunday, April 6, 2025
HomeNEWSట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వస్థ ల‌క్ష్యం

ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వస్థ ల‌క్ష్యం

స్ప‌ష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆవిష్కరణలు, పరిశోధన, తయారీ, నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి చేయాలని ముందుకు సాగుతున్నామ‌న్నారు. సులభమైన పారిశ్రామిక విధానం, మౌలిక సదుపాయాలు, ఆశించినంత మద్దతు అందించేందుకు త‌మ‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్ప‌ష్టం చేశారు. పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు.

ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో తన‌తో పాటు మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు, ఉన్న‌తాధికారుల బృందం పాల్గొంద‌ని చెప్పారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌పంచంలోనే పేరు పొందిన దిగ్గ‌జ ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ కంపెనీల చైర్మ‌న్లు, సీఈఓలు, మేనేజింగ్ డైరెక్ట‌ర్ల‌ను క‌ల‌వ‌డం జ‌రిగింద‌న్నారు. తాను చేసిన చ‌ర్చ‌ల కార‌ణంగా తెలంగాణ రాష్ట్రానికి గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా భారీ ఎత్తున నిధులకు సంబంధంచి ఒప్పందం చేసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు.

ఏకంగా తెలంగాణ రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిందని చెప్పారు. ఈ ఘ‌న‌త త‌న వ‌ల్ల‌నే ద‌క్కింద‌న్నారు సీఎం. విభిన్న రంగాలలో దాదాపు 50,000 ఉద్యోగాలు రానున్నాయని ఆశా భావం వ్య‌క్తం చేశారు. గత ఏడాది లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.40,000 కోట్లకు పైగా పెట్టుబడులను విజయవంతంగా ఆకర్షించామ‌న్నారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ కింద గ్రీన్ ఫార్మా సిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంద‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments