బీఆర్ఎస్స్ నేతలకు బలుపు తగ్గలేదు
సీఎం ఎ. రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారు. వారికి అధికారం పోయినా బలుపు తగ్గలేదంటూ సెటైర్ వేశారు సీఎం.
సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామని అనుకుంటున్నాడని, కానీ తాను ఉన్నంత వరకు జరగనీయనని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.
సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదన్నారు. అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారని , దమ్ముంటే వచ్చి విగ్రహంపై చేయి వేయాలని సవాల్ విసిరారు.
నీ అయ్య విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా? అని నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నాడు కేటీఆర్… బిడ్డా.. మీకు అధికారం ఇక కలనే.. ఇక మీరు చింతమడకకే పరిమితం కావాల్సిందేనని అన్నారు సీఎం.
పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మాదని ప్రకటించారు.