జగదీశ్ రెడ్డీ జర తగ్గితే బెటర్
నిప్పులు చెరిగిన సీఎం..కోమటిరెడ్డి
హైదరాబాద్ – రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం మాటల యుద్దం కొనసాగింది. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ మరింత రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. విద్యుత్ కమిషన్ పై చర్చ సందర్బంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా ఎలా దోచుకున్నారనే దానిపై అంకెలతో సహా వివరించే ప్రయత్నం చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.
దాదాపు రూ. 8,000 కోట్లకు పైగా కుంభకోణం చోటు చేసుకుందని సంచలన ఆరోపణలు చేశారు సీఎం. దీనిపై విచారణకు ఆదేశిస్తే ఎందుకు అంతగా ఉలికి పడుతున్నారంటూ మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు .
స్కామ్ కు పాల్పడింది వాళ్లేనని, దానిని కప్పి పుచ్చుకునేందుకు తమపై నిందలు మోపితే ఎలా అని మండిపడ్డారు. ఇదే సమయంలో తనపై లేనిపోని ఆరోపణలు చేసిన మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిపై సీరియస్ అయ్యారు. సూర్యాపేట రైస్ మిల్లులో చోరీ చేస్తే దొరికిన దొంగను చెట్టుకు కట్టేసి కొట్టిన చరిత్ర ప్రజలందరికీ తెలుసన్నారు.
ఇదిలా ఉండగా జగదీశ్ రెడ్డిపై పలు మర్డర్లకు సంబంధించిన కేసులు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.