కేసీఆర్ కామెంట్స్ సీఎం సీరియస్
పీకెనీకె పోయిండ్రా అంటాడా
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు మాజీ సీఎం కేసీఆర్ పై. బుధవారం అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. ఒక సీఎంను పట్టుకుని పీకనీకి పోయారా అని అంటారా అంటూ మండిపడ్డారు. తెలంగాణ సమాజం పట్ల, రైతుల పట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్షం మేడిగడ్డ కు వచ్చేదన్నారు.
పదే పదే బీఆరెస్ నేతలు భాష గురించి మాట్లాడుతున్నారని నిన్న మాజీ సీఎం నల్లగొండలో మాట్లాడిన మాటలు, వాడిన భాష ఒక్కసారి గుర్తుకు తెచ్చు కోవాలన్నారు. తెలంగాణ ప్రజలు మొన్నటి ఎన్నికల్లో మీ ప్యాంట్ ఊడి పోయేలా తీర్పు ఇచ్చారని ఎద్దేవా చేశారు.
మేడిగడ్డ కుంగిపోతే.. అందులో నీళ్లు నింపడానికి అవకాశం ఉంటదా అని నిలదీశారు రేవంత్ రెడ్డి.
కడియం శ్రీహరి, హరీష్ లకే పెత్తనం ఇస్తామని నీళ్లు నింపి చూపించాలని సవాల్ విసిరారు. చర్చకు సిద్ధమైతే మీ సభాపక్ష నేతను అసెంబ్లీకి రమ్మనండి అని అన్నారు.
కాళేశ్వరంపై, నదీ జలాలపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు సీఎం. కేసీఆర్ చంపుతారా అని అంటుండు.. అసలు ఎక్కడైనా చచ్చిన పామును చంపుతారా అంటూ ఎద్దేవా చేశారు. మీరు చెప్పినట్టు మెడిగడ్డలో రెండో మూడో పిల్లర్లు కుంగినాయంటే సభలో చర్చ చేద్దాం రండి అని పిలుపునిచ్చారు.