నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాళ్లు, రప్పలు, లే అవుట్ లకు రూ.22 వేల కోట్ల రైతు బంధు ఇచ్చారంటూ ఆరోపించారు. గత ప్రభుత్వం మొత్తం రైతు బంధుకు రూ. 72,816 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
తాము ఏడాదిలో రూ. లక్ష 27 వేల కోట్లు అప్పు చేశామన్నారు. ప్రతి నెలా రూ. 6 వేల 500 కోట్ల అప్పులు కడుతున్నామని అన్నారు. వాళ్ల లాగా తాము గజ్వేల్, మోయినాబాద్ , జన్వాడ లో ఫామ్ హౌస్ లు కట్టుకోలేదన్నారు.
విచిత్రం ఏమిటంటే తెలంగాణ పేరుతో నిట్ట నిలువునా తెలంగాణ ప్రాంతాన్ని మోసం చేశారని ఆరోపించారు. వాళ్లు చేసిన అప్పులు చెల్లించేందుకు తిరిగి తమకు అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎ. రేవంత్ రెడ్డి.
దీనికి ఏం జవాబు చెబుతారంటూ సీరియస్ గా ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి. దీనికి మీరే జవాబు చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తాము పూర్తి వివరాలను సభ ముందు ఉంచామని చెప్పారు