ప్రధానమంత్రికి లేఖ రాసేందుకు రెడీ
హైదరాబాద్ – కేంద్ర సర్కార్ పై సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా కేంద్రం అత్యున్నతమైన పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఎంపిక చేసింది. ఏపీకి ప్రయారిటీ ఇవ్వగా తెలంగాణ పట్ల వివక్ష చూపించింది. ప్రధానంగా ప్రభుత్వం నుంచి పలువురిని ఎంపిక కోసం సిఫారసు చేసింది. అయినా మోడీ సర్కార్ పట్టించు కోలేదు.
దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు సీఎం. సర్కార్ తరపున గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరేటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు ల పేర్లను పంపించింది. వీరిలో ఏ ఒక్కరికీ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా
మొత్తం పద్మ అవార్డులకు సంబంధించి 139 మందికి పురస్కారాలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం . తెలంగాణకు కనీసం 5 పురస్కారాలు ప్రకటించక పోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడాన్ని మోడీ , ఆయన పరివారం జీర్ణించుకోలేక పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అవార్డుల ఎంపిక లో పూర్తిగా పారదర్శకత లోపించిందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి ఉందా అన్న విషయం మోడీకి తెలుసా అని ప్రశ్నించారు.