మోడీ అండతోనే సెబీ కుంభకోణం – సీఎం
మోడీ..అమిత్ షా..అదానీ..అంబానీ దుష్టులు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన కేంద్ర సర్కార్ ను, పీఎం నరేంద్ర మోడీపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశాన్ని సర్వ నాశనం చేస్తున్నారంటూ ఆరోపించారు. హైదరాబాద్ లోని ఈడీ ఆఫీసు ముందు టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
గుజరాత్ కు చెందిన నరేంద్ర మోడీ, అమిత్ షా, అదానీ ,అంబానీ దేశం పాలిట దుష్ట చతుష్టయంగా తయారయ్యారని ఆరోపించారు .
మోడీ అండతోనే సెబీ కుంభకోణం జరిగిందని మండిపడ్డారు. దీనికి సంబంధించి సెబీ చైర్మన్ మాధుబి బచ్ ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు. కుంభ కోణంకు సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని ఇండియా కూటమి పార్టీల నేతలు కోరారని ఎందుకు వేయలేదని ప్రశ్నించారు ఎ. రేవంత్ రెడ్డి.
దీనిపై లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి తామంతా మద్దతుగా ఉంటామని అన్నారు. దేశ ఆస్తులను ఇతరులకు ఇవ్వకుండా, అప్పగించకుండా కాపాడు కుంటామని చెప్పారు సీఎం.
ఇదే సమయంలో బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని ఆరోపించారు. సెబీ స్కాంపై బీఆర్ఎస్ వైఖరి ఏమిటో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.