సబితక్కను నమ్ముకుంటే బతుకు బస్టాండే
నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని ఏకి పారేశారు. బుధవారం శాసన సభలో ప్రసంగించారు. సబితక్కను నమ్ముకుంటే బతుకు జూబ్లీ హిల్స్ బస్టాండే అవుతుందంటూ వ్యంగ్య అస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సమర్థించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు .
ఈ సందర్బంగా తీవ్ర అభ్యంతరం తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు. ఇదిలా ఉండగా తనపై వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి.
కాంగ్రెస్ పార్టీలోకి తాను వచ్చినప్పుడు పెద్ద నాయకుడివి అవుతావంటూ ప్రోత్సహించానని చెప్పారు. కానీ ఇలా నిండు సభలో తనను అవమానించేలా మాట్లాడతారని అనుకోలేదని అన్నారు సబితా ఇంద్రా రెడ్డి. ఆమె కంట తడి పెట్టారు. ఒక్కసారిగా అసెంబ్లీలో మాటల యుద్దం కొనసాగడంతో వాతావరణం వేడెక్కింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.