అల్లు అర్జున్ పై నాకెందుకు కక్ష
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
ఢిల్లీ – సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. తనకు చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ తెలుసుని, ఆయనకు తాను కూడా తెలుసన్నారు.
అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత. అల్లు అర్జున్ కు పిల్లను ఇచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లీడర్, తనకు బంధువు అని అన్నారు. పోలీసులు వాళ్ల పని వాళ్లు చేశారంతే ఇందులో పాలిటిక్స్ లేవన్నారు.
సినిమా రంగం అనేది వ్యాపారమని పేర్కొన్నారు. ఆయన నటించిండు..డబ్బులు వచ్చినవి. తీసుకున్నాడు..దీంతో తమకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు .
ఆయన ఏమైనా భారత్, పాకిస్తాన్ దేశ సరిహద్దులో పని చేశాడా అని ఎద్దేవా చేశారు. తనకు అల్లు అర్జున్ అరెస్ట్ తో ఎలాంటి సంబంధం లేదన్నారు. చట్టం తన పని తాను చేసుకు పోతుందని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.