ENTERTAINMENT

చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకు పోతుంది

Share it with your family & friends

సీఎం అనుముల రేవంత్ రెడ్డి కామెంట్స్

ఢిల్లీ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈ సంద‌ర్బంగా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్య‌వ‌హారం. దీనిపై జాతీయ మీడియాతో మాట్లాడారు రేవంత్ రెడ్డి.

అల్లు అర్జున్ అరెస్ట్ విష‌యంపై షాకింగ్ కామెంట్స్ చేశారు సీఎం. అల్లు అర్జున్ కేసు విష‌యంలో చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకు పోతుంద‌న్నారు. కేసు ద‌ర్యాప్తునకు సంబంధించి తాను జోక్యం చేసుకోవ‌డం జ‌ర‌గ‌ద‌ని స్ప‌ష్టం చేశారు . తొక్కిస‌లాట‌లో చ‌ని పోవ‌డం వ‌ల్లే పోలీసులు చ‌ర్య‌లు తీసుకున్నార‌ని పేర్కొన్నారు.

అందుకే త‌న‌ను అరెస్ట్ చేశార‌ని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. చ‌ట్టం ఎవ‌రికీ చుట్టం కాద‌న్నారు. ఇప్ప‌టికే సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన ఘ‌ట‌న‌లో ఒక‌రు చ‌ని పోయార‌ని, మ‌రొక‌రి ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంద‌న్నారు రేవంత్ రెడ్డి. దీనిపై ఏం చేయాల‌నే దానిపై పోలీసులు చూసుకుంటార‌ని పేర్కొన్నారు . త‌న‌తో ఎవ‌రూ ట‌చ్ లో లేర‌ని చెప్పారు. అయినా తాను స్పందించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *