రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో తానే కుల గణన చేపట్టానని అన్నారు. 1931 నుంచి ఎవరూ బీసీ కుల సర్వే చేపట్టలేదని ఆరోపించారు. తాను బీసీ నంటూ పీఎం మోదీ పదే పదే చెప్పుకుంటాడని ఎద్దేవా చేశారు. బీసీల కోసం పాటుపడిన తనను కేసీఆర్, మోదీ ఓడించాలని చూస్తున్నారంటూ సంచలనా రోపణలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదన్నారు.
పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జరిగిన సభలో ప్రసంగించారు. తానే స్వయంగా కుటుంబ సర్వే చేశానని చెప్పడం విస్తు పోయేలా చేసింది. అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇదిలా ఉండగా కుటుంబ సర్వే తప్పుల తడకగా ఉందని పెద్ద ఎత్తున బీసీ సంఘాలు, మేధావులు, బుద్ది జీవులు మండిపడ్డారు. ఆందోళనలు చేపట్టారు. దీంతో దెబ్బకు ప్రభుత్వం దిగి వచ్చింది.
గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సర్వేలో బీసీల జనాభాకు సీఎం రేవంత్ రెడ్డి హయాంలో చేపట్టిన సర్వేకు చాలా తేడా ఉందంటూ మండిపడ్డారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలను అణగ దొక్కేందుకే ఈ నాటకం ఆడారంటూ ఆరోపించారు. మరోసారి సర్కార్ బీసీ సర్వే కు ఆదేశించింది.