NEWSTELANGANA

వాళ్ల‌ను ఉరి తీసినా తప్పు లేదు

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో రాష్ట్రాన్ని స‌ర్వ నాశ‌నం చేశార‌ని ఆరోపించారు. రూ. 7 ల‌క్ష‌ల 25 వేల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లార‌ని, వాటికి రూ. 16 వేల కోట్ల‌కు పైగా నెల నెలా క‌డుతున్నామ‌ని అన్నారు. 11.5 శాతం మిత్తికి అప్పులు తెచ్చారని ఆరోపించారు.

గొప్ప గొప్ప బ్యాంకులు ప్రాజెక్టులకు 2 నుంచి 4 శాతం వ‌డ్డీకి అప్పు ఇస్తే వీళ్లు మాత్రం ఎక్కువ మిత్తికి తెచ్చార‌ని పెను భారం మోపార‌ని ఆరోపించారు. వీరిని ఉరి తీసినా త‌ప్పు లేద‌న్నారు. ఇంతటి ఆర్థిక నేరానికి పాల్పడిన వీళ్లను ఇతర దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపేవారని అన్నారు రేవంత్ రెడ్డి.

వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసింది చాలక పైపెచ్చు త‌మ పార్టీని, ప్ర‌భుత్వాన్ని నీరుగార్చే ప్ర‌య‌త్నం చేయ‌డం దారుణ‌మ‌న్నారు . ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని వ‌ళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ప్ర‌వ‌ర్తిస్తే మంచిద‌న్నారు ముఖ్య‌మంత్రి. ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసేందుకు తాము తీవ్రంగా కృషి చేస్తున్నామ‌ని చెప్పారు.

ఆరు నూరైనా స‌రే అన్ని హామీల‌ను నెర‌వేర్చేందుకు శ‌త విధాలుగా ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని తెలిపారు సీఎం. కాని కావాల‌ని బీఆర్ఎస్ నేత‌లు త‌మ‌ను బ‌ద్నాం చేసేలా దుష్ప్ర‌చారం చేయ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *