సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్
హైదరాబాద్ – ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కూటమి విభేదాలే కొంప ముంచాయని అన్నారు. హర్యానాలో ఆప్ ఏ విధంగా కాంగ్రెస్ ఓటమికి కారణమైందో ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి హస్తం కారణమైందని పేర్కొన్నారు. చిట్ చాట్ సందర్బంగా సీఎం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇండియా కూటమిలో చోటు చేసుకున్న విభేదాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశాయన్నారు. ఒకవేళ ఆప్, కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే సీన్ వేరేగా ఉండేదన్నారు.
ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి రాజకీయ వర్గాలలో. తాజాగా ఢిల్లీ రిజల్ట్స్ వెలువడ్డాయి. మొత్తం 70 స్థానాలకు గాను 50 స్థానాలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఇక 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కేవలం 20 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ తన ఖాతా ఓపెన్ చేయలేదు.
13 సీట్ల నుంచి 15 సీట్ల దాకా తక్కువ మార్జిన్ ఓట్ల తేడాతో సీట్లను కోల్పోయాయి ఆప్, కాంగ్రెస్ పార్టీలు. ఒక సీటులో రెండవ స్థానంలో నిలిచింది కాంగ్రెస్ పార్టీ. ఇరు పార్టీలు కలిసి బరిలోకి దిగి ఉంటే బీజేపీకి అన్ని సీట్లు వచ్చి ఉండేవి కావని అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.