నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి
మేడిగడ్డ – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన మాజీ సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. మంగళవారం తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి బస్సుల ద్వారా మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును రూ. 1,49,000 కోట్లతో ఎందుకు నిర్మించారో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు రేవంత్ రెడ్డి. మేడిగడ్డకు ఎందుకు పోయిండ్రో చెప్పాలని, ఏముంది అక్కడ బొందల గడ్డనా అని కేసీఆర్ పదే పదే ఆక్రోశం వెళ్లగక్కుతున్నారని అందుకే సమాధానం చెప్పేందుకే అక్కడికి వెళ్లడం జరిగిందన్నారు.
కేసీఆర్ ధన దాహంతో లక్ష కోట్లు గుమ్మరించి కట్టిన ప్రాజెక్టు ఇవాళ బొందల గడ్డగా మారిందన్నారు సీఎం. తొమ్మిదిన్నర ఏళ్ల కిందట తెలంగాణను పచ్చగా చేస్తానని మాయ మాటలు చెప్పారని, కానీ ఇవాళ ఎడారిగా మార్చేశారంటూ మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో కమీషన్లు బుక్కారంటూ సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి.
ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ తో విచారణ చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు.