NEWSTELANGANA

అప్పుల భారం అయినా ప‌థ‌కాలు ఆపం

Share it with your family & friends

రూ. 7 ల‌క్ష‌ల కోట్ల అప్పు చేసిన కేసీఆర్

హైద‌రాబాద్ – రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి మండిప‌డ్డారు. త‌మ పాలిట గ‌త స‌ర్కార్ చేసిన అప్పులు భారంగా మారాయ‌ని వాపోయారు. ఎక్స్ వేదిక‌గా స్పందించారు సీఎం.

గత పాలనలో రూ.7,00,000 కోట్లకు పైగా అప్పుల భారంతో రాష్ట్ర పాలనను చేపట్టామ‌ని తెలిపారు. సాకులు చెప్పడానికి బదులుగా, రుణాలు, కేటాయింపులు, రాబడి మెరుగుదలలు, చెల్లింపుల నిర్వహణపై కఠినమైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు ఎ. రేవంత్ రెడ్డి.

రైతులు, మహిళలు, పాఠశాల విద్యార్థులు, నిరుద్యోగ యువత వాటాదారుల ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా సంక్షేమ వాగ్దానాలను అందించడంపై ఫోక‌స్ పెట్టామ‌న్నారు. అన్ని రంగాలు , ప్రాంతాల కోసం బలమైన అభివృద్ధి దృష్టిని నిర్మించడం ద్వారా గొప్ప ఫలితాలను అందించామ‌ని పేర్కొన్నారు సీఎం.

తెలంగాణను సస్య శ్యామలం చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. కానీ ముందుకు వెళ్లే మార్గం చాలా దూరంగా ఉంద‌న్నారు. ప్రజాపాలన చేస్తున్న ప్రయత్నాల్లో చేరాలని ప్రతి పౌరుడిని ఆహ్వానిస్తున్న‌ట్లు కోరారు సీఎం.