సవాల్ విసిరిన ముఖ్యమంత్రి రేవంత్
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. అడ్డగోలుగా మాట్లాడటం తనకు కూడా వచ్చని అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. 10 ఏళ్ల పాలనా కాలంలో కేసీఆర్ చేసింది ఏమీ లేదన్నారు. తమ ఆస్తులు పెంచుకునేందుకు మాత్రమే పని చేశారని ఆరోపించారు.
తాము వచ్చాక గాడి తప్పిన వ్యవస్థను సక్రమంగా తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఎవరు ప్రజలకు సేవలు అందిస్తున్నారో తెలుసన్నారు. నిరాధారమైన విమర్శలు చేయడం మానుకోవాలని, ఖలేజా అనేది ఉంటే తాను తన ముందుకు రావాలని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ తమపై కావాలని బీఆర్ఎస్ శ్రేణులు బద్నాం చేసేందుకు కుట్రకు తెర లేపారంటూ ఆరోపించారు . ఎన్ని కుట్రలు చేసినా, ఇంకెన్ని జిమ్మిక్కిలు ప్రయోగించినా వర్కవుట్ కాదన్నారు. జనం తమ వైపు ఉన్నారని, ఇది చరిత్ర చెప్పిన సత్యం అంటూ స్పష్టం చేశారు.