నిప్పులు చెరిగిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. అసెంబ్లీ సాక్షిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో భాష చూడండి.. కుటుంబ సభ్యులు, ఆడబిడ్డల మీద ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజా జీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నా అని అన్నారు. కాదు అంటే.. ఒక్కడు కూడా బయట తిరగ లేడన్నారు.. మీ అమ్మపై, చెల్లిపై ఇలాంటి పోస్టులు పెడితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.. హద్దు దాటితే ఇకపై ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆడపిల్లల వీడియోలు తీసి పోస్ట్ చేస్తే ఎలా అని నిలదీశారు. జర్నలిస్టు అంటే వివరణ ఇవ్వండి.. ముసుగేసుకుని వస్తే గుడ్డలు ఊడదీసి కొడతానని ఫైర్ అయ్యారు.
శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్ ఇచ్చారు. మేం చేసిన అప్పు రూ.4,682 కోట్లు.. కానీ, కేసీఆర్ చేసిన అప్పులకు అసలు రూ.88,591 కోట్లు, వడ్డీ రూ.64,768 కోట్లు చెల్లించాం.. 15 నెలల్లో రూ.లక్షా 53 వేల కోట్లు కట్టామన్నారు. కేసీఆర్ హయాంలోనే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. కేసీఆర్ సంతకం చేసి తెలంగాణకు మరణ శాసనం రాశారని ఆరోపించారు. గుండెల్లో పెట్టుకుని పార్లమెంట్‌కు పంపిస్తే గుండెల మీదే తంతావా? పార్లమెంట్‌కు పంపించినందుకు పాలమూరుకు ఏం చేశావు..? మీరు చేసిన పాపాలను మా నెత్తిన నెట్టేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.