సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్
వరంగల్ జిల్లా – కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సంచల కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అది కూలేశ్వరమని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కట్టించామని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నాడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిన ప్రాజెక్టులన్నీ ఎవరు కట్టించారో హరీశ్ రావు చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పిల్ల కాకులతో నాకెందుకు.. అసలైన వాళ్లనే రావాలని అన్నారు.ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదమో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. చెప్పిన మాట ప్రకారం వరంగల్‌కు ఎయిర్‌పోర్టును సాధించి ఈ రోజు మీ ముందు నిలబడ్డానని అన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు అభివృద్ధి పనులను చేసి చూపించామన్నారు.
వరంగల్ నగరాన్ని హైదరాబాద్‌తో పోటీ పడేలా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని చెప్పారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకుని అందరినీ ఉసిగొల్పుతున్నాడని ఆరోపించారు. అధికారం పోతే బయటికి రాడా అని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే కేసీఆర్ కుటుంబం అప్పులపాలు చేసిందంటూ ఆవేదన వ్యక్తం ఏశారు. సింగరేణి, విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టారని మండిపడ్డారు. ఈపదేళ్లలో దివాళా తీసిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటన నడిపిస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.