ఫార్ములా ఈ రేస్ పై సీఎం కామెంట్స్
త్వరలోనే వివరాలు సమర్పిస్తామని వెల్లడి
హైదరాబాద్ – రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేటీఆర్ అరెస్ట్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. శుక్రవారం అసెంబ్లీలో ఆయన ఫార్మూలా ఈ – రేస్ పై మాట్లాడారు. దీని మీద ప్రభుత్వం తరపున పూర్తి స్థాయి వివరాలు సమర్పిస్తామని ప్రకటించారు సీఎం.
బీఆర్ఎస్ బయట పెట్టిన ఫొటోలో ఎఫ్ఈవో కంపెనీ ప్రతినిధితో ఉన్నది తానేనంటూ వెల్లడించారు . ఆనాడు వాళ్లు వచ్చి చెబితేనే కేటీఆర్ బండారం బయట పడిందన్నారు. ఈ తర్వాతే ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి విచారణ చేపట్టామన్నారు. గవర్నర్ కు లేఖ రాశామన్నారు సీఎం.
అందుకే ఏసీబీకి కేసు అప్పగించామని స్పష్టం చేశారు ఎ. రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండగా తనపై కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. చివరకు కేటీఆర్ కు ఊరట ఇచ్చేలా కోర్టు వ్యాఖ్యలు చేసింది.
డిసెంబర్ 30వ తేదీ దాకా కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు వీలు లేదని తీర్పు చెప్పింది. ఇదే సమయంలో కేటీఆర్ తరపున లాయర్ సుందరం అద్భుతంగా వాదించారు. ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించారని ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. మొత్తంగా కేటీఆర్ కు రిలీఫ్ దక్కగా రేవంత్ కు షాక్ తగిలింది.