Saturday, April 5, 2025
HomeNEWSస‌ర్కార్ న‌డ‌ప‌డం క‌ష్టంగా మారింది

స‌ర్కార్ న‌డ‌ప‌డం క‌ష్టంగా మారింది

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కామెంట్

హైద‌రాబాద్ – ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మాజీ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ఆయ‌న స్ట్రెచ‌ర్ మీద ఉన్నార‌ని , అంత సీన్ లేదంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. కేసీఆర్ తెలంగాణ పేరుతో నిలువు దోపిడీకి పాల్ప‌డ్డాడ‌ని ఆరోపించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదాయం నెల‌కు రూ. 18 వేల కోట్ల నుంచి రూ. 18,500 కోట్లు మాత్ర‌మేనని చెప్పారు. త‌న‌కు ఇష్టం ఉన్నా లేక పోయినా ప్ర‌తి నెలా రూ. 6500 కోట్లు అప్పులుగా చెల్లించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. బ్యాంకులో ప‌డ‌గానే ఆర్బీఐ తీసుకుంటుంద‌న్నారు.

క‌ల్వ‌కుంట్ల కుటుంబం చేసిన దోపిడీ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు రేవంత్ రెడ్డి. నా బంధువులు, ఆత్మ బంధువులైన ఉద్యోగుల జీత భత్యాల కింద రూ. 6500 కోట్లు చెల్లించాల్సి వస్తోంద‌ని చెప్పారు. ఇక మిగిలింది రూ. 5 వేల నుంచి రూ.5500 కోట్లు మాత్రమేన‌ని వెల్ల‌డించారు సీఎం. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఇందులో నుంచే తీయాల్సి వ‌స్తోంద‌న్నారు. అందుకే వేత‌నాలు ఇవ్వ‌డంలో ఆల‌స్యం జ‌రుగుతోంద‌ని చెప్పారు రేవంత్ రెడ్డి. ఉద్యోగులు, సిబ్బంది అర్థం చేసుకోవాల‌ని కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments