ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయాలని కొందరు కుట్రలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మనుషుల్ని పెట్టి విష ప్రచారాలు చేసినా దావోస్ పర్యటనలో లక్షా 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామన్నారు..
రాష్ట్ర ప్రభుత్వ డబ్బు తీసుకెళ్లి వాళ్లు విదేశాల్లో పెట్టుబడులు పెట్టారని అన్నారు. ఈ-ఫార్ములా కేసులో ఇక్కడి సొమ్ము విదేశాలకు పంపి పెట్టుబడి పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. దీనిపై విచారణ జరుగుతోందన్నారు. లక్షా 80 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ సాధించామన్నారు రేవంత్ రెడ్డి.
ప్రజల సొమ్ము కొల్లగొట్టి విదేశాల్లో పెట్టుబడులు పెట్టారని ధ్వజమెత్తారు. ఫిర్యాదు చేసిన వ్యక్తిది బానిస మనస్తత్వం అంటూ మండిపడ్డారు. తాము దావోస్ వెళ్లింది పెట్టుబడులు తీసుకురావడానికే తప్పా ఎంజాయ్ చేసేందుకు వెళ్ల లేదన్నారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వచ్చాయని చెప్పారు రేవంత్ రెడ్డి. ఈ పెట్టుబడుల ద్వారా అనేక ఉద్యోగాలు రాబోతున్నాయని ప్రకటించారు.. తెలంగాణను వన్ ట్రిలియన్ ఎకానమీగా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు.. మన విద్యార్థులు సింగపూర్‌కు వెళ్లి శిక్షణ తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.