నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆప్ ఓడి పోవడానికి ప్రధాన కారణం కల్వకుంట్ల కుటుంబమేనని ఆరోపించారు. ఎవరైనా మహిళలు రాజకీయాలు చేయడం చూశాం కానీ ఎక్కడా లిక్కర్ దందా చేసినట్లు తాను చూడలేదన్నారు. ఆమె చేసిన నిర్వాకం కారణంగానే అరవింద్ కేజ్రీవాల్ పార్టీ అధికారానికి దూరమైందన్నారు. కవిత కారణంగా తెలంగాణలో బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయిందని, ఢిల్లీలో ఆప్ ను నామ రూపాలు లేకుండా చేసిందన్నారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని పదేళ్ల పాటు రాచరిక పాలన సాగించారని ఆరోపించారు. అడ్డగోలు దందాలు చేస్తూ ప్రజలకు నరకం చూపించారని ధ్వజమెత్తారు. లారీల కొద్ది డబ్బులు ఉన్నాయని, వాటిని చూసుకుని మురిసి పోతున్నారని, అన్నింటిని కక్కిస్తానని వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.
అల్లుడు, కొడుకు, బిడ్డ, మేనల్లుడు ఇలా ప్రతి ఒక్కరు రాష్ట్రాన్ని పంచుకున్నారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులపై విచారణకు ఆదేశించామన్నారు సీఎం. అన్నీ త్వరలోనే బయటకు వస్తాయని, వాళ్లు జైలుకు వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు.