శాంతి భద్రతల విషయంలో రాజీ లేదు
స్పష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. కమాండ్ కంట్రోల్ రూమ్ లో టాలీవుడ్ ప్రముఖులతో భేటీ అయ్యారు. సినిమా రంగానికి తాము వ్యతిరేకం కాదని పూర్తిగా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. సంధ్య థియేటర్ ఘటన గురించి మరోసారి ప్రస్తావించారు, మహిళ చని పోవడం వల్లనే తాను చర్యలకు ఆదేశించానని చెప్పారు. బౌన్సర్ల విషయంలో కఠినంగా ఉంటామన్నారు.
సీఎంతో కీలక అంశాలపై చర్చించారు నిర్మాతలు, నటులు. యూనివర్శల్ స్టూడియోను ఏర్పాటు చేయాలని కోరారు నటుడు అక్కినేని నాగార్జున, దర్శకుడు రాఘవేంద్రరావు. దీనికి తమ వంతు సహకారం ఉంటుందని అన్నారు సీఎం.
ఇప్పటికే శాసన సభ సాక్షిగా తాను బెనిఫిట్ షోస్ , టికెట్ల రేట్ల పెంపు విషయంపై కీలక ప్రకటన చేయడం జరిగిందన్నారు. ఇందులో వెనక్కి తగ్గేది లేదన్నారు. టాలీవుడ్ కు సంబంధించి ఎవరైనా బౌన్సర్లను పెట్టుకుంటే వారిదే బాధ్యత అని తేల్చి చెప్పారు. వారి విషయంలో సీరియస్ గా ఉంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా సినీ పరిశ్రమలో రాజకీయ జోక్యం అంటూ ఉండదని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.