ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కామెంట్
హైదరాబాద్ – పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జాతకాలు తన వద్ద దగ్గర భద్రంగా ఉన్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఎవరెవరు ఏం చేస్తున్నారనే ప్రోగ్రెస్ రిపోర్టులు వచ్చాయన్నారు. నేను మారానని, మీరూ మారాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకమని, సత్తా చాటాలని పిలుపునిచ్చారు. సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు.
ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. పార్టీకి సంబంధించి కీలక సమావేశం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్బంగా స్థానిక సంస్థలు రాబోతున్నాయని చెప్పకనే చెప్పారు. ప్రత్యర్థులకు ఒక్క సీటు కూడా పోకుండా చూడాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు. ఇప్పటి దాకా ఉన్న గ్రాఫ్ ను మరింత పెంచాలని స్పష్టం చేశారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందని చెప్పారు. భారీ ఎత్తున నిధులను కేటాయించామన్నారు. గ్రామాల అభివృద్దికి నిధులు మంజూరు చేశామన్నారు.