Friday, April 4, 2025
HomeNEWSపార్టీ కోసం ప‌ని చేసిన వారికి ప‌ద‌వులు

పార్టీ కోసం ప‌ని చేసిన వారికి ప‌ద‌వులు

ఇచ్చేందుకు కృషి చేశామ‌న్న సీఎం

హైద‌రాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ కోసం ముందు నుంచి ప‌ని చేసిన వారికి కీల‌క‌మైన ప‌ద‌వులు ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. కొంద‌రు త‌న గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు రాని వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని హామీ ఇచ్చామ‌ని, అవన్నీ ఇప్పుడు అమలు చేస్తున్నామ‌ని చెప్పారు. పార్టీ అనుబంధ విభాగాల్లో పని చేసినవారికి ఒకేసారి 37 కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చామ‌ని తెలిపారు. అందులో భాగంగానే అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్‌లకు ఎమ్మెల్సీలు ఇచ్చామ‌ని అన్నారు.

గురువారం సీఎం ఎ. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పదేళ్లలో కేసీఆర్ ఒక్క పాలసీని కూడా తీసుకు రాలేదని ఆరోపించారు. డీసీసీ అధ్యక్షులందరికీ పదవులు ఇచ్చామ‌ని స్ప‌ష్టం చేశారు. గాంధీ కుటుంబంతో త‌న‌కు చాలా మంచి అనుబంధం ఉంద‌న్నారు. అయితే తాను ఫోటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదన్నారు రేవంత్ రెడ్డి. కేంద్ర క్యాబినెట్ లో ఉన్న నిర్మలా సీతారామన్ గతంలో తమిళనాడుకు మెట్రో ఇవ్వ‌డంలో కీల‌క పాత్ర పోషించార‌ని చెప్పారు. అయితే కేంద్ర మంత్రిగా ఉన్న కిష‌న్ రెడ్డి మాత్రం తెలంగాణ గురించి ప‌ట్టించు కోవ‌డం లేదంటూ మ‌రోసారి మండిప‌డ్డారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments