ఈవీఎంలతో గెలుస్తున్న మోదీ
ప్రజల ఓట్లతో కాదన్న రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రతీసారి జరిగే ఎన్నికల్లో భారీ మెజారిటీ ఎలా వస్తుందని ప్రశ్నించారు. ప్రజలు ఓ వైపు తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో ఉన్నారని, ఓ వైపు నిరుద్యోగం ఇంకో వైపు ద్రవ్యోల్బణం ఇబ్బంది పెడుతోందన్నారు. కానీ మోదీ మాత్రం ధీమాతో ఉన్నారని దాని వెనుక ఉన్న మర్మం ఏమిటనేది 143 కోట్ల భారతీయులందరికీ తెలుస్నారు రేవంత్ రెడ్డి.
మోదీ, బీజేపీ దాని అనుబంధ పార్టీలు కేవలం ప్రజల ఓట్లతో గెలవడం లేదని కేవలం ఈవీఎంల ద్వారానే గెలుస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎంలలో మోదీ ఏ నెంబర్ నొక్కితే అదే వస్తుందన్నారు. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని తాము కోరుతున్నామని అన్నారు సీఎం.
కానీ ఇందుకు తన బండారం బయట పడుతుందని ప్రధానమంత్రి ఒప్పు కోవడం లేదని ధ్వజమెత్తారు. ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని, దమ్ముంటే ప్రజా క్షేత్రంలోకి రావాలని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు .