సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్
మధ్య ప్రదేశ్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు రాజ్యాంగాన్ని కాపాడాలని అనుకునే వారికి మార్చాలని అనుకునే వాళ్లకు మధ్య పోరాటం జరుగుతోందన్నారు. మోడీ ప్రధాని అయినప్పటి నుంచి రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 143 కోట్ల ప్రజలతో రాజ్యాంగం ముడి పడి ఉందన్నారు. ఇండోర్ లో జరిగిన జై బాపు జై భీం జై సంవిధాన్ ర్యాలీలో సీఎం పాల్గొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ గాంధీతో కలిసి పోరాడటం జరుగుతోందన్నారు. మోడీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తాము అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. భయపెట్టడం, కేసులు నమోదు చేయడం, ఈడీ, ఏసీబీ, ఐటీ దాడులతో లొంగ దీసుకోవాలని అనుకోవడం మంచి పద్దతి కాదన్నారు.
ఫెడరల్ స్పూర్తికి భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రజలు బీజేపీని, దాని పరివారాన్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించరని , గుర్తుపెట్టుకుంటే మంచిదని హితవు పలికారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.