సీఎం ఎ. రేవంత్ రెడ్డి కామెంట్స్
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు పీఎం మోడీపై. బీజేపీకి ఆయన తప్ప వేరే దారి లేదన్నారు. కానీ తమ పార్టీలో హేమా హేమీలు ఉన్నారని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో సైతం పీఎం పేరు చెప్పుకుంటేనే వాళ్లకు ఓట్లు పడతాయంటూ ఎద్దేవా చేశారు. ఒకవేళ తాను గనుక ప్రచారం చేస్తే ప్రజలు తనను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనుకునే ప్రమాదం ఉందన్నారు. జాతీయ నాయకత్వం క్యాంపెయిన్ చేస్తే ఆ ప్రభావం ఉండక పోవచ్చని అభిప్రాయపడ్డారు.
ఆదివారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలపై స్పందించారు. త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని, దేశంలో ఎక్కడా లేని రీతిలో కుల గణన సర్వే చేపట్టామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించేందుకు వీలు కుదరదన్నారు. కానీ తాము పార్టీ పరంగా వారికి అత్యధికంగా సీట్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు ఎ. రేవంత్ రెడ్డి.
బీజేపీ కేవలం హిందూ ఓటు బ్యాంకును ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేస్తోందని, వారు రాజకీయాలను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు ట్రై చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.