సీఎం రేవంత్ రెడ్డి కామెంట్
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏపీలోని టీటీడీపై భగ్గుమన్నారు. ప్రతిసారి వాళ్లను మా ఎమ్మెల్యేలు లెటర్లతో దర్శనం అడుక్కోవడం ఎందుకంటూ ప్రశ్నించారు. వాళ్లకు టీటీడీ ఉంటే మాకు వైటీడీ ఉందన్నారు. భద్రాచలంలో రాముడు లేడా ..మనకు శివాలయాలు లేవా అంటూ పేర్కొన్నారు. ఇదే సమయంలో తనను ఎవరూ నమ్మడం లేదంటూ వాపోయారు. మార్కెట్ లో ఎవరూ అప్పులు ఇవ్వడం లేదన్నారు. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు రూ.8000 కోట్లు పెండింగ్ ఉన్నాయని, డబ్బులు ఎక్కడి నుండి తీసుకు రావాలని అన్నారు సీఎం.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారని.. గత ప్రభుత్వ పాలనలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెర వేరలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఎన్ని నియామకాలు చేపట్టింది.. ఎన్ని పరీక్షలను సజావుగా నిర్వహించిందంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. మీ కుటుంబ సభ్యుల సమక్షంలో నియామక పత్రాలు ఇచ్చింది మా ప్రభుత్వం అన్నారు.. 10 నెలల్లో మేము చేసిన పనులను.. 10 ఏళ్లలో మీరు ఎందుకు చేయలేదని అన్నారు. ఈ నోటిఫికేషన్లు అన్నీ తాము ఇచ్చినవేనంటూ చెప్పారు. మీ కుటుంబంలో వారిని ప్రజలు తిరస్కరిస్తే.. 6 నెలల్లోనే వేరే పదవులను కేసీఆర్ ఇచ్చారంటూ ధ్వజమెత్తారు.