ఇస్తాంబుల్..అమెరికా చేస్తానని అనలేదు
బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకంపై ఆగ్రహం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాకాలు, ఆచరణకు నోచుకోని హామీలను ఇవ్వడం లేదన్నారు. బుధవారం జరిగిన శాసన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ నలు ఏకి పారేశారు.
తనను చీల్చి చెండాడుతానంటూ ప్రకటిస్తే భయంతో తాఆను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని వచ్చానని చెప్పారు సీఎం. కేటీఆర్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఫోకస్ పెట్టామని, కానీ కేటీఆర్ కు ఇంటెలిజెన్సీ లేదంటూ ఎద్దేవా చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి. ఇక కేటీఆర్ కు ఓపిక, సహనం ఉండాలన్నారు. కానీ అనవసరంగా తమను టార్గెట్ చేస్తూ నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు సీఎం.
ఎంఎంటీఎస్ ను విమానాశ్రయం వరకు వేస్తామంటే అనుమతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీని వెనుక ఆర్థిక కుట్ర ఏంటో అందరికి తెలియాలన్నారు.. మేమెప్పుడు మీలాగా పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామని చెప్పలేదన్నారు.. హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలాగ మార్చుతామని అనలేదన్నారు… స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. టూరిజం హబ్ క్రియేట్ చేస్తామని ప్రకటించారు.. ప్రపంచ స్థాయి వైద్యం హైదరాబాద్ నగరంలో అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు సీఎం.