దందాలు చేసేటోళ్లు బెదిరిస్తే ఎలా
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
పాలమూరు జిల్లా – తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను బెదిరింపులకు గురి చేయాలని అనుకోవడం దారుణమన్నారు. తాను అష్టకష్టాలు పడి ఈ స్థాయికి వచ్చానని చెప్పారు రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించారు సీఎం.
గద్వాల వాళ్లు దొంగ సారా అమ్ముతారని, కల్తీ కల్లు అమ్ముతారని, క్రషర్ మిషన్లు లెక్కలేనన్ని ఉన్నాయని, రోడ్ల కాంట్రాక్టులు సైతం వాళ్లవేనని ..ఇన్ని దందాలు చేసే వాళ్లు తనను టార్గెట్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని భరత సింహా రెడ్డి, డీకే అరుణా రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉండగా పాలమూరు లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి చల్లా వంశీ చందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీలో ఉన్నారు డీకే అరుణా రెడ్డి. ఇక్కడ నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.