మాజీ సీఎంపై భగ్గుమన్న రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు మాజీ సీఎం కేసీఆర్ పై. బలంగా కొట్టడం కాదు ముందు నువ్వు కట్టె సాయం లేకుండా ఒంటరిగా నిలబడి చూపాలని సవాల్ విసిరారు. లేనిపోని అభాండాలు వేయడం, అసత్య ఆరోపణలు చేయడం పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ కామెంట్స్ కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
టిక్ టాక్ లో పోల్ పెడితే తనకు ఎక్కువ లైక్ లు ఎలా వస్తాయంటూ ప్రశ్నించారు. ప్రజలు తిరస్కరిస్తే తట్టుకోలేక ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ ను జనం ఆదరిస్తారంటే నమ్మగలమా అన్నారు. తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసింది నువ్వు కాదా అని ధ్వజమెత్తారు. సిగ్గు శరం లేకుండా తనపై లేనిపోని విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు.
రాష్ట్రంలో తమ ప్రభుత్వం కొలువు తీరాకే ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. ప్రజా పాలన కొనసాగిస్తున్నామని, ఇలాంటి పాలన గురించి నువ్వా విమర్శలు చేసేది అంటూ ఫైర్ అయ్యారు. తమ సర్కార్ పనితీరు గురించి ఎన్ని సర్వేలు చేయించినా వచ్చేది వంద శాతం తమ వైపేనని అన్నారు. వారివన్నీ పెయిడ్ సర్వేలంటూ కొట్టి పారేశారు సీఎం రేవంత్ రెడ్డి.