హరీశ్ రావు మరో ఔరంగజేబు
సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్
హైదరాబాద్ – త్వరలో రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కింది. ఆయా పార్టీలకు చెందిన నేతలు మరింత దూకుడు పెంచారు. నువ్వా నేనా అన్నరీతిలో మాటల తూటాలు పేల్చుతున్నారు.
ప్రధానంగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశారు. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీని సైతం ఏకి పారేస్తున్నారు. పనిలో పనిగా మాజీ సీఎం కేసీఆర్, తనయుడు మాజీ మంత్రి కేటీఆర్, అల్లుడు హరీశ్ రావు, కూతురు కల్వకుంట్ల కవితలపై భగ్గుమంటున్నారు.
ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా మాజీ మంత్రి హరీశ్ రావును ఏకి పారేశారు. ఆయనను చూస్తుంటే మరో ఔరంగ జేబు లాగా కనిపిస్తున్నారంటూ ధ్వజమెత్తారు ఎనుముల రేవంత్ రెడ్డి.
అధికారం కోసం సొంత వాళ్ల పైనే కర్కశంగా ప్రవర్తించిన చరిత్ర ఔరంగ జేబుదని ఇలాంటి లక్షణాలు హరీశ్ రావులో తనకు కనిపిస్తున్నాయంటూ ఎద్దేవా చేశారు.