మీ శాపనార్థాలు పని చేయవు
నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – నాపై ఎన్ని ఆరోపణలు చేసినా తాను తట్టుకుని నిలబడతానని ముందు మీరేమిటో చూసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ కేసీఆర్ వల్ల రాలేదన్నారు. నిరుద్యోగులు, యువత , సంబండ వర్గాలు పాల్గొంటే , బలిదానం చేసుకుంటే, పోరాటాలు చేస్తే వచ్చిందన్నారు.
తెలంగాణ పేరుతో విధ్వంసాన్ని సృష్టించింది మీరు కాదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. పదేళ్ల పాలనలో నిరుద్యోగులకు మిగిలింది ఏమీ లేదన్నారు. కల్వకుంట్ల కుటుంబం బాగు పడిందే తప్పా ఏ ఒక్కరికీ ఒక్క జాబ్ రాలేదన్నారు.
వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టాకే మీకు కొలువులు వచ్చాయని, ఈ సంగతి మరిచి పోవద్దన్నారు. బావ బావమరుదులు కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. లేక పోతే ప్రజలు ఈసారి ఎన్నికల్లో బండకేసి కొట్టడం ఖాయమని జోష్యం చెప్పారు రేవంత్ రెడ్డి.
తాము కొలువుల భర్తీకి చర్యలు తీసుకుంటుంటే హరీశ్ రావు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఇకనైనా ప్రతిపక్షంగా బాధ్యతా యుతంగా వ్యవహరిస్తే మంచిదని సలహా ఇచ్చారు సీఎం.